‘గేమ్ ఛేంజర్’ నా కెరీర్‌లో పెద్ద గుణపాఠం : దిల్ రాజు

‘గేమ్ ఛేంజర్’ నా కెరీర్‌లో పెద్ద గుణపాఠం : దిల్ రాజు

అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘తమ్ముడు’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి లయ కీలక పాత్రలో కనిపించనున్నారు. జూలై 4న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దిల్ రాజు, ఒక ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ తన కెరీర్‌లో ఒక పెద్ద తప్పిద నిర్ణయమని దిల్ రాజు స్పష్టంగా చెప్పారు. శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితో పని చేయడం ఇదే తొలిసారి అని, ఆ అనుభవం తనకు చాలా పెద్ద గుణపాఠంగా నిలిచిందని ఆయన తెలిపారు. పెద్ద డైరెక్టర్లు, భారీ బడ్జెట్ సినిమాలతో పని చేస్తే సమస్యలు రావడం సాధారణమని, అది తనకే కాదు అందరికీ ఎదురయ్యే సమస్యేనని అన్నారు.‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ సమయంలో, దర్శకుడు శంకర్ తన ప్రమేయం లేకుండా కొన్ని విషయాలను తానే డిసైడ్ చేశాడని పరోక్షంగా సూచించారు. మొదటి కట్ నాలుగు గంటల 30 నిమిషాలుగా వచ్చినట్లు ఎడిటర్ తనకు చెప్పిన విషయాన్ని కూడా దిల్ రాజు గుర్తుచేశారు. పెద్ద డైరెక్టర్లతో సినిమా చేయడం అంటే మిగతా విషయాల్లో జోక్యం చేసుకోవడం కష్టమే కానీ, నిర్మాతగా సమస్యలు కనిపిస్తే వెంటనే ఆపాలి — ఆ బాధ్యతను తాను సరిగ్గా నిర్వర్తించలేకపోయానని ఆత్మవిమర్శ చేశారు.అంతే కాకుండా, ‘గేమ్ ఛేంజర్’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినదే తాను చేసిన తప్పు అని, ఆ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టకూడదని ఇప్పుడైనా అనిపిస్తోందని దిల్ రాజు చెప్పుకొచ్చారు. చివరి కట్ వరకు తాను సినిమా చూడలేదన్న వార్తలను ఖండిస్తూ, తానే ముందే చూశానని స్పష్టం చేశారు.పెద్ద దర్శకులతో సినిమా చేయాలంటే కచ్చితమైన నిబంధనలతో కాంట్రాక్ట్ చేసుకోవాలని, ఆ విషయంలో తనకు విఫలమవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని దిల్ రాజు వివరించారు.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు