మున్నాభాయ్ కి పెద్ది టీం బ‌ర్త్ డే విషేష్.....

మున్నాభాయ్ కి పెద్ది టీం బ‌ర్త్ డే విషేష్.....

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్‌ పూర్తి ఉత్సాహంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో నిర్మించిన ప్రత్యేకమైన భారీ సెట్‌లో, కీలక సన్నివేశాలను దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ (‘మున్నా భయ్యా’గా ‘మీర్జాపూర్’ సిరీస్‌తో ప్రసిద్ధి గాంచాడు) కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో దివ్యేండు శర్మ ‘రాంబుజ్జి’ అనే పాత్రలో నటిస్తున్నారని ప్రకటించారు.సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్‌కి తోడు కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి మరో కీలక తారాగణం కూడా నటిస్తున్నాడు.వృద్ధి సినిమాస్ సమర్పణలో, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...