అమ్మ పేరుతో మొక్క నాటాలి

అమ్మ పేరుతో మొక్క నాటాలి

- డికె. స్నిగ్దా రెడ్డి.

గద్వాల, లోకల్ గైడ్ :
తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటి, దాన్ని పరిరక్షిస్తూ, పర్యావరణాన్ని కాపాడలని బిజెపి జిల్లా ఇంచార్జి డికె. స్నిగ్దా రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గద్వాల పట్టణంలోని అంబా భవాని టెంపుల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టి.క్రిష్ణ వేణి ఆద్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డికె. స్నిగ్దా రెడ్డి మాట్లాడుతూ..ప్రతీ భారతీయ పౌరుడు ‘ఏక్ పేడ్ మాకే నామ్’ నినాదంతో తమ తల్లి పేరుతో ఒక్కో మొక్కను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయ పడ్డారు. వాతావరణ మార్పులపై పోరాటానికి, భవిష్యత్ తరాల పరిరక్షణకు మొక్కలు నాటడమే శరణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజ నేయులు, జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి,  జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అక్కల రమాదేవి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, మాజీ కౌన్సిలర్ కుమ్మరి శ్రీను, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాసు, రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యుడు అనిల్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ చిత్తారికిరణ్,  మండల అధ్యక్షులు  శ్రీనివాసులు, తిరుపతి రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు గీత రెడ్డి, ఢిల్లీవాల కృష్ణ, మోహన్ రెడ్డి, కుమ్మరి వెంకటేష్, రెడ్డప్ప, లత్తి పురం రామిరెడ్డి, రామకృష్ణ, శంకర్, రాజు తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా.  ఒక సంవత్సరం విధులు పూర్తయిన సందర్భంగా. 
నేను సైతం.    -మన్నెంలో 'రాహుల్ రేలా'                                             -అడవి బిడ్డలకు కొండంత అండ.                          -గిరిజన ప్రగతికి కీలక అడుగులు.                            -పదునైన ప్రణాళికలతో ఫలితాలు.                          -ఏడాది పాలనలోనే యువ ఐఏఎస్...
మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులందరూ భాగస్వామ్యం అవ్వాలి
రంగారెడ్డి జిల్లా APM పల్లె కృష్ణయ్యకు గ్రాట్యూటీ చెక్కును కుటుంబానికి అందజేసిన కలెక్టర్
స్ట్రాబెర్రీలు.. చిన్న పండ్లు, గొప్ప లాభాలు!
మహేష్‌ బాబు డెడికేషన్‌ నాకు పాఠం లాంటిది: త్రిష
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ వివాహం వాయిదా!
ఎమ్మెల్యే నాయిని కి కృతజ్ఞతలు