బీజేపీ సుల్తానాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఘనంగా తిరంగా ర్యాలీ
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 12 (లోకల్ గైడ్)
80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కన్వీనర్ ఉషణ అన్వేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సుమారు 2,000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 200 మీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు చేతబట్టి పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో పట్టణం మార్మోగింది.ఈ కార్యక్రమానికి అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మీసా అర్జున్ రావు లు హాజరైనారు, ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు
కర్రే సంజీవరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, జాతీయ జెండా భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, త్యాగాలకు ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, కాసాగోని నిర్మల, కందునూరి కుమార్ ,ఎండీ రఫీక్,మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, కొల్లూరి సంతోష్ కుమార్, కోట నాగేశ్వర్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి,మల్కా భాగ్యలక్ష్మి,బండారి లత,పుచ్చకాయల హనుమంత రెడ్డి,రాజన్న పటేల్, ఎల్లేంకీ రాజన్న, గుడ్ల వెంకటేష్, వలస సాయి, ఎర్రం సంతోష్ రెడ్డి,వీరగోని కిరణ్, వెంకటేష్ దాసరి, పొన్న శ్రీనివాస్, ఈర్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
