- District News
- Nizamabad
- ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, ఆగష్టు 12:
ఓ యువ దంపతులు తమ విలువైన జీవితాన్ని చలించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాదు నగరంలోని నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.కాగా పోస్ట్ మార్టం అనంతరం బుధవారం అంత్యక్రియలు జరిగాయి.
నాల్గో టౌన్ ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణా పరిధిలో నివాసముండే శేషాల నరేష్, మేఘన దంపతులను కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. నరేష్ విద్యుత్‌శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మానసిక ఒత్తిడిలో ఉండడంతో నరేష్ కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నాడు. అయితే అప్పులు పెరిగిపోవడం.. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లోనే మేఘన పురుగుల మందు తాగగా, నరేష్ ఉరి వేసుకున్నాడని ఎస్ హెచ్ వో తెలిపారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు నరేష్ ఇంట్లో సూసైడ్ నోట్ సైతం లభించింది. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వారు అందులో పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఆర్థిక ఇబ్బందులు మానసిక సమస్యలే వీరి ఆత్మహత్యలకు కారణమని వారి కుటుంబ సభ్యులు బున్ని మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
