- District News
- ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌కు మెమొరాండం
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌కు మెమొరాండం
Published On
By Ram Reddy
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ( యూ ఎస్ పీ సీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం మండల తహసీల్దార్‌కు మెమొరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీ ఎస్ యూ టీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి. మురళీమోహన్, ఏటీఎఫ్ నాయకుడు పి. నాగేశ్వరరావు, టీ ఎస్ యూ టీ ఎఫ్ నాయకులు వి. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయం మేరకు ఆగష్టు 7న పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపామని, 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు మెమొరాండాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ నెల 19న జిల్లా కేంద్రాల్లో ధర్నా, 29న రాష్ట్ర కేంద్రంలో ధర్నా
నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని, అందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 22 నెలల పీఆర్సీని అమలు చేయకుండా జాప్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 37 నెలలు గడిచినా పీఆర్సీ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వెంటనే పీఆర్సీ నివేదికను తీసుకొచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్ అమలులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులు తమ సమస్యల కోసం పోరాటం చేస్తే ప్రజా సంక్షేమం గుర్తుకు వస్తుందని, ఉపాధ్యాయులు ఉద్యమిస్తే విద్యార్థుల చదువులు గుర్తుకు వస్తాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగం, విద్యార్థుల సమస్యలేనని స్పష్టం చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, జెన్‌జీ యువత ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేలకు తగ్గిస్తామని ప్రకటించడం వల్ల గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ నాయకులు పి. నాగేశ్వరరావుతో పాటు టీ ఎస్ యూ టీ ఎఫ్ నాయకులు వి. బాలకృష్ణ, వసంత, పి. రాధ, టి. జలంధర్, సావిత్రి, యడమరాజు, హిమగిరి, ఎస్. బాలకృష్ణ, బి. సర్వేశ్వరరావు, ప్రదీప్, చిట్టిబాబు, రామారావు, పంతులు, జయప్రకాష్, రవి, స్వర్ణలత, ప్రవల్లిక, అమ్మాజి, సమ్మక్క, సావిత్రి, సుజాత, వరలక్ష్మి, కృష్ణయ్య, వీర్రాజు, తాటి నరసింహారావు, జయలక్ష్మి, లక్ష్మీదేవి, పద్మావతి, హరిబాబు, రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. టాప్రా నాయకులు పి. నరసింహారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.Tags:
About The Author
Related Posts
Latest News
12 Aug 2026 20:56:07
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లోని కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బెల్లంపల్లి నియోజకవర్గ
