కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ

Published On
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) 

 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లోని కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయంలోని వసతులు,విద్యార్థులకు అందుతున్న భోజనం,విద్యా సౌకర్యాలు ఎమ్మెల్యే పరిశీలించారు.మెనూ ప్రకారం భోజనం సక్రమంగా అందుతుందా లేదా అని,భోజనం నాణ్యత,చదువులో ఇబ్బందులు, వసతులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థినులు తమ సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.అనంతరం విద్యార్థినులతో కొద్దిసేపు సరదాగా ముచ్చటించి వారి చదువు,భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు.విద్యాలయంలో 42లక్షలు,53లక్షల వ్యయంతో చేపడుతున్న డార్మిటరీ,అదనపు గదుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని,పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థినులు తమకు గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆటలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని,గ్రౌండ్‌ను చదును చేసి మట్టి పోయించి ఆటలకు అనువుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థినుల చదువుతో పాటు వారి ఆరోగ్యం,క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఆటలు ఆడుకునేందుకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్‌ను పరిశుభ్రంగా చేసి,అవసరమైన పనులు చేయిచి ఆటలకు అనువుగా తీర్చిదిద్దేలా సంబంధిత అధికారులతో మాట్లాడి తయారు చేయిస్తానని తెలిపారు.విద్యార్థినులకు ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని,విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడు ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం కాసిపేట మండలంలోని కొండాపూర్(యాప)గ్రామానికి చెందిన పోడేటి గంగ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని,వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రత్నం ప్రదీప్,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)    మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లోని కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బెల్లంపల్లి నియోజకవర్గ
విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ బలి
ఎస్‌.ఐ.ఆర్‌. ప్రక్రియలో తదుపరి దశకు సన్నద్ధం కావాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
బీజేపీ సుల్తానాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో సుల్తానాబాద్‌ మండల కేంద్రంలో ఘనంగా తిరంగా ర్యాలీ
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
సీఎం రేవంత్ సభ ఏర్పాట్ల పై   అధికారులు, ముఖ్య నాయకులతో సమావేశమైన టీపీసీసీ  వర్కింగ్ ప్రెసిడెంట్
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌కు మెమొరాండం