తమ్ముడు" సినిమాను థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం డిజైన్ చేశాం - మూవీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో దర్శకుడు శ్రీరామ్ వేణు
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తమ్ముడు" సినిమా రిలీజ్ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలోడీవోపీ కేవీ గుహన్ మాట్లాడుతూ - దిల్ రాజు గారి బ్యానర్ అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటిది. "తమ్ముడు" సినిమాకు ముగ్గురు డీవోపీలం పనిచేశాం. అయితే మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆ తేడా ఎక్కడా కనిపించదు. టెక్నీషియన్స్ గా మేమే కాదు ఆర్టిస్టులు కూడా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా నేను చూశాను. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్నారు.ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ - దిల్ రాజు గారు, నితిన్ గారు, శ్రీరామ్ వేణు గారితో నేను గతంలో పనిచేశాను. శ్రీరామ్ వేణు గారితో నాకిది మూడో మూవీ. చాలా మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుని వాటి ద్వారా నావెల్టీ ఉన్న మూవీని శ్రీరామ్ వేణు గారు రూపొందించారు. వకీల్ సాబ్ మూవీ చేస్తున్నప్పటి కంటే ఎక్కువ గంటలు డైరెక్టర్ గారితో నేను డిస్కషన్స్ చేశాం. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. అన్నారు.గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ - "తమ్ముడు" సినిమాలో పగడాలమ్మ జాతర నేపథ్యంలో జై బగళాముఖీ పాట రాసే అవకాశం రావడంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఈ పాటను అజనీష్ ఎంతో ప్రతిభావంతంగా కంపోజ్ చేశాడు. అమ్మవారి పాటను ఈ సినిమాలో చిత్రీకరించాలని ఆలోచన దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి రావడం గొప్ప విషయం. ఇందుకు నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ పాటకు పనిచేస్తున్నప్పుడు తమ్ముడు సినిమా కోసం టీమ్ అంతా ఎంత కష్టపడుతున్నారో తెలిసింది. తమ్ముడు సినిమా మీద కనకవర్షం కురవాలని కోరుకుంటున్నా. అన్నారు.నటి హరితేజ మాట్లాడుతూ - "తమ్ముడు" సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం వెళ్లినప్పుడు డైరెక్టర్ గారు జ్వరంతో ఉండి కూడా క్యారెక్టర్ నెరేట్ చేశారు. ఇది నేను ఇప్పటిదాకా చేసిన అన్ని క్యారెక్టర్స్ లోకి డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా షూటింగ్ లో కష్టపడ్డాం అయితే ఆ కష్టం తర్వాత సక్సెస్ రూపంలో రాబోతున్న సంతోషం ఎంతో విలువైనదిగా భావిస్తాను. అన్నారు.బేబి దిత్య మాట్లాడుతూ - "తమ్ముడు" మూవీలో నన్ను ఆడిషన్ లో సెలెక్ట్ చేసిన డైరెక్షన్ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే నన్ను ఈ క్యారెక్టర్ లో నటింపజేసిన డైరెక్టర్, మా నాన్న గారికి థ్యాంక్స్. నన్ను బాగా చూసుకున్న టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు థ్యాంక్స్. "తమ్ముడు" మూవీ అమేజింగ్ గా ఉంటుంది. మీరంతా బాగా ఇష్టపడతారు. అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మాట్లాడుతూ - "తమ్ముడు" మూవీకి పనిచేసిన ఎక్సిపీరియన్స్ చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో ఒక సందర్భంలో డైరెక్టర్ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, మన ఇంటిగ్రిటీ గురించి చెప్పారు. ఆ టైమ్ లో నాకు కన్నీళ్లు వచ్చాయి. శ్రీరామ్ వేణు గారు చెప్పిన సీన్స్ నుంచే కొత్త తరహా మ్యూజిక్ చేసే స్ఫూర్తి కలిగింది. ఈ సినిమాకు వర్క్ చేశాక నాకొక సోదరి ఉంటే బాగుండేది అనిపించింది. థియేట్రికల్ గా ఎక్సిపీరియన్స్ చేయాల్సిన చిత్రమిది. ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ కాకండి. అన్నారు.హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ - ఈ సినిమాలో రత్న అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ గారికి థ్యాంక్స్. రత్న క్యారెక్టర్ లో నేను బాగా నటించేందుకు సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్స్. హీరో నితిన్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ మూవీ కోసం మేమంతా 2 ఇయర్స్ కష్టపడ్డాం. మరో మూడు రోజుల్లో మా మూవీ మీ ముందుకు వస్తోంది. "తమ్ముడు" సినిమాను థియేటర్స్ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.