- District News
- Khammam
- టిజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఖమ్మం ప్రెస్ క్లబ్ అట్టహాసంగా స్వాతంత్ర్య దినోత్సవ వ...
టిజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఖమ్మం ప్రెస్ క్లబ్ అట్టహాసంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు
దేశ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, లౌకికవాద ప్రజాస్వామ్య సమ సమాజా నిర్మాణం కోసం ఆనాటి మహనీయులు చేసిన త్యాగాల ఫలితాలుగానే నేడు స్వేచ్ఛ జీవులుగా ఉంటున్నామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లు మాట్లాడుతూ..స్వాతంత్ర్య కోసం అనేకమంది తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి స్వాతంత్ర్యన్నీ సాధించాలని, వారు చేసిన త్యాగాలు బావితరాలకు మార్గదర్శకమని అన్నారు. ఐక్యతతోనే ఏదైనా సాధించవచ్చు అని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ నిరంతరం పాటుపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, వెలుగు ప్రశాంత్ రెడ్డి, మందుల ఉపేందర్, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు యలమందల జగదీష్, ప్రెస్ క్లబ్ కోశాధికారి బిక్కీ గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్వీ రెడ్డి, ఉపాధ్యక్షులు పానకాలరావు,రేపాక యాదగిరి, మూల జీవన్ రెడ్డి, నాయకులు తిరుపతిరావు,ఉల్లోజు రమేష్, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, అప్పారావు, పులి శ్రీను, రోసి రెడ్డి, నాగ శేఖర్, బోనగిరి యాదగిరి, మోహన్, కూరపాటి నరేష్, నల్లమోతు శ్రీను, రోజా, కిరణ్మయి, మాధవి, బత్తుల శంకర్, రవీందర్, రవి, మంద వెంకటేశ్వర్లు, లింగయ్య, పెంటి వెంకటేశ్వర్లు,రేగళ్ల లక్ష్మణ్ కొండలరావు, రాంబాబు, సాంబశివరావు, రమేష్, బోడ పట్ల సతీష్, బిక్షం, పాషా, తదితరులు పాల్గొన్నారు.
