- District News
- Khammam
- శ్రీ జయ శ్లోక (SJS) హై స్కూల్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
శ్రీ జయ శ్లోక (SJS) హై స్కూల్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖమ్మం : లోకల్ గైడ్ శ్రీ జయ శ్లోక (SJS) హై స్కూల్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ సాంస్కృతిక ప్రదర్శనలు: ఖమ్మం,ఆగస్టు15: లోకల్ గైడ్:. విద్యార్థులలో దేశభక్తి ని నింపేవిధంగా, స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన క్విజ్ కార్యక్రమం స్ఫూర్తిని నింపింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం చేసిన ఆపోరాటాలను ప్రతి విద్యార్థి తెలుసుకునే అవకాశం గా ఉపయోగపడింది. చిన్నారులలో ప్రతిభను వెలికి తీసేందుకు, దేశభక్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ఆర్ట్ కాంపిటీషన్ అద్భుతంగానే ఉంది. విద్యార్థులు తమ ప్రతిభతో వేసిన చక్కని పెయింటింగ్స్ ఎంతో అలరించాయి. వాటిని చూసి పేరంట్స్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు ప్రదర్శించిన నృత్యాలు, పాడిన పాటలతో స్కూల్ ప్రాంగణమంతా భారతదేశం మీద ఉన్న ప్రేమ, గౌరవం ప్రతిధ్వనించింది. స్కూల్ కరెస్పాండంట్ షిఫాలీ జగదీష్ శర్మ గారు , జెండావందనం చేసిన తరువాత, విద్యార్థులందరికీ స్టీల్ బాక్స్ బహుకరించారు. వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం అంటే ఏమిటో, మన పూర్వీకులు చేసిన త్యాగాలకు మనం తిరిగి ఇవ్వవలసినది ఏమిటో వివరించారు. ప్రతి ఒక్కరు చిన్నప్పటినుండే దేశం మీద ప్రేమతో జీవించాలని, దేశానికి మనం ఏమి చేయగలం? ఈ దేశ అభివృద్ధికి మనం ఏ విధంగా తోడ్పడగలము అని ఆలోచించాలని అన్నారు. పేరెంట్స్ కూడా ఇంటి వద్ద తమ పిల్లలను క్రమశిక్షణ గల భారత పౌరులుగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. వందేమాతర నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు.
