- District News
- ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయండి.
ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయండి.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య.
లోకల్ గైడ్, జిల్లేడు చౌదరిగూడెం.
కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలను విధానాలను నీరసిస్తూ
ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్దుల జంగయ్య అన్నారు. ఆదివారం జిల్లేడు చౌదరిగూడెం మండల కేంద్రంలో బస్సు యాత్ర గోడ పత్రికను విడుదల చేశారు.ఈ సందర్బంగా
అయన మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాలన సాగిస్తుందని ఆయన ఆరోపించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నెరవేర్చలేక ధరల మీద ధరలు పెంచి ప్రజల నెత్తిపై ఎనలేని భారాన్ని మోపి ఇష్టానుసారగా వ్యవహరిస్తుందని ఆయన దుయబట్టారు. నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి పేదవారి అకౌంట్లో 15 లక్షలు చేస్తామన్న నరేంద్ర మోడీ ఒక్క రూపాయి నల్లధనాన్ని కూడా దీనికి తీసుకురాలేక పొగ అవినీతిపరులను నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు బ్యాంకులను మోసగించిన సీటర్స్ను దేశం నుంచి తప్పించి విదేశాలకు పంపించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కిందన్నారు.
ప్రజలు బిజెపి ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉద్యమించి సందర్భం వచ్చినప్పుడు జాతీయవాదం కులం మతం పేరుతో ప్రజలను చల్లబరుస్తున్నారు.
యువత తిరగబాటు కాక్రోచ్ జనతపార్టి రూపంలో స్పష్టంగా అర్థమైందని భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు బిజెపి ప్రభుత్వం పై చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు..సర్ పేరా ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు తొలగిస్తున్నారు.ఇప్పటికే 73 లక్షల ఓట్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తొలగించారు 18 సంవత్సరాలు నిండిన యువత దేశంలో ఎంతమంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఓటు హక్కు ఎందుకు కల్పిస్తలేరని వారు ప్రశ్నించారు.విత్తనాల పేర పెట్రోల్ డీజిల్ భారీ కుంభకోణానికి తెరలేపిందన్నారు.కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నిజాయితీ గురించి చెప్పుకునే నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఎందుకు తగ్గిస్తలేరని ఆయన ప్రశ్నించారు. వెంటనే పెంచిన ధరలను అదుపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 17 నుంచి 21 వరకు రంగారెడ్డి జిల్లాలో ప్రజా చైతన్య ప్రచార యాత్రను నిర్వహిస్తుందని ఈ ప్రచార యాత్ర 19వ తేదీన కొందుర్గు మండలానికి రాబోతుందన్నారు.అధిక సంఖ్యలో ప్రజానీకం పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్, మండల సహాయ కార్యదర్శి ఎండి షబ్బీర్,మండల నాయకులు అన్వర్, చోటి బాయ్, పాపయ్య, లక్ష్మయ్య,రామయ్య, తదితరులు పాల్గొన్నారు.
