- District News
- కెవిసిఎస్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కెవిసిఎస్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- ఆజాదీ కీ అమర్ గాథా” ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులు
లోకల్ గైడ్ తాండూర్.
కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి, ఉత్సాహంతో శనివారం ఘనంగా నిర్వహించారు. హెడ్‌మాస్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్లు మల్లేశం, వెంకటేశం, సతీష్‌ల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ క్రమంలో విద్యార్థుల మార్చ్‌పాస్ట్, దేశభక్తి గీతాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన “ఆజాదీ కీ అమర్ గాథా – 1857 నుంచి 1947 వరకు” చారిత్రక నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని విద్యార్థులు తమ నటన ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు.
తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనూ ఈ ప్రదర్శనను నిర్వహించగా, ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్,పలువురు హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ మేరకు,
జూనియర్ కేజీ చిన్నారి రాష్ట్రాలు–రాజధానులను చెప్పడంతో పాటు శ్లోకాలు వినిపించి ఆకట్టుకోగా, 5వ తరగతి విద్యార్థుల దేశభక్తి గీతం, 3వ తరగతి విద్యార్థుల ప్రసంగాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎందరో మహనీయుల త్యాగఫలమే నేడు మనం స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నామన్నారు. విద్యార్థులు మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రశాంత్ మాట్లాడుతూ... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తితో దేశాభివృద్ధికి ప్రతి విద్యార్థి కృషి చేయాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
