'వచ్చినవాడు గౌతమ్' టీజర్ రిలీజ్

Published On
 'వచ్చినవాడు గౌతమ్' టీజర్ రిలీజ్

యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'వచ్చినవాడు గౌతమ్' టీజర్ తో హ్యుజ్  బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో - ప్రొడ్యూసర్.

ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది.

ఆగస్ట్ 1 హీరో అశ్విన్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయనకి విషెష్ అందిస్తూ మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అశ్విన్ బాబు ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది.  

ఇటివలే భారీ బడ్జెట్ తో  హైవోల్టేజ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తి చేశారు. హై టెక్నాలజీని వాడి ఈ యాక్షన్ సీక్వెన్స్‌ షూట్ చేశారు.

నిర్మాత గణపతి రెడ్డి ఎలాంటి రాజీ లేకుండా, పెద్ద చిత్రాలకు ఏమాత్రం తీసిపోని ప్రొడక్షన్‌ విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, కీలక పాత్రలు పోహిస్తున్నారు.
 
ఈ చిత్రానికి  ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ. ఆయన విజువల్‌ ప్రెజెంటేషన్‌ ఈ క్లైమాక్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది. చిత్రానికి గౌర హరి మ్యూజిక్ అందిస్తున్నారు. M R వర్మా ఎడిటర్.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.
   

Tags:

About The Author

Related Posts

Latest News

పేరుపల్లికి అభివృద్ధి బాటలు.. ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పేరుపల్లికి అభివృద్ధి బాటలు.. ఎంపీ నిధులతో సీసీ రోడ్డు
ఎంపీ రాంసహాయం రఘురామ్‌రెడ్డికి, కాంగ్రెస్ నాయకత్వానికి గ్రామస్థుల కృతజ్ఞతలు
ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయండి.
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌లో పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు.
కెవిసిఎస్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
శ్రీ జయ శ్లోక (SJS) హై స్కూల్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఖమ్మంలో ఘనంగా 'మై డ్రీమ్ ప్రాజెక్ట్స్' అధినేత వి. హరినాథ్ బాబు జన్మదిన వేడుకలు
టిజెఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ  ఖమ్మం ప్రెస్ క్లబ్ అట్టహాసంగా  స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు