- District News
- సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలు.
సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలు.
శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఉత్సాహంగా సంబరాలు - పూల బతుకమ్మలతో అలరించిన విద్యార్థినులు
Published On
By Ram Reddy
-
లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందుతుందని డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్ రెడ్డి, చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ జయవర్ధన్ రెడ్డి ,ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Oct 2026 20:51:04
వెల్లివిరిసిన మత సామరస్యం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాలనీవాసులు.
