వికారాబాద్ జిల్లాలో కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత..  జైదుపల్లి మురళి గృహ నిర్బంధం, 

జిల్లా కేంద్రం లో ఎన్‌టీఆర్ చౌరస్తా వద్ద భారీ పోలీసు మోహరింపు

Published On
వికారాబాద్ జిల్లాలో కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత..  జైదుపల్లి మురళి గృహ నిర్బంధం, 

 

- 


(లోకల్ గైడ్)
వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

జిల్లా లో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార/ప్రతిపక్ష నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి.
సవాల్‌తో రేగిన హీట్:
బిఆర్‌ఎస్ నాయకుడు అశోక్ విసిరిన సవాల్ కు సవాలుగా వికారాబాద్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సరిగ్గా ఉదయం 9 గంటలకు వికారాబాద్‌లోని ఎన్‌టీఆర్ చౌరస్తాకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు.
ఇంటి వద్దే గృహనిర్బంధం
ఈ సవాల్‌ను స్వీకరించి, ఎన్‌టీఆర్ చౌరస్తాకు బయలుదేరేందుకు మాజీ కౌన్సిలర్ జైదుపల్లి మురళి సిద్ధమై కొత్తగడి కి సిద్ధమైన వికారాబాద్ చందన బ్రదర్స్ దగ్గర పోలీసులు అరెస్టు చేసి  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు తలెత్తకుండా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జైదుపల్లి మురళి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టి, ఆయనను ఇంటి వద్దే అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.
హైటెన్షన్ వాతావరణం:
ఈ పరిణామంతో జైదుపల్లి మురళి నివాస ప్రాంతంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
 పోలీస్ బందోబస్తు
మరోవైపు, ఎన్‌టీఆర్ చౌరస్తా మరియు ప్రధాన రహదారుల వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కదలికలను నిశితంగా పరిశీలిస్తూ, రాకపోకలపై నిఘా ఉంచారు. ఈ తాజా పరిణామాలు వికారాబాద్‌ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Tags:

About The Author

Latest News