మధ్యాహ్న భోజనంపై డీడబ్ల్యూఓ ఆరా

నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక పరిశీలన

Published On
మధ్యాహ్న భోజనంపై డీడబ్ల్యూఓ ఆరా

 

 

కారేపల్లి, సెప్టెంబర్ 29 (లోకల్ గైడ్ న్యూస్ ):

కారేపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలును జిల్లా సంక్షేమ అధికారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించి, భోజన నాణ్యత, వంట విధానం, వంటశాల పరిశుభ్రతపై ఆరా తీశారు. వంట నిర్వాహకులు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, వంట చేసే సమయంలో చేతులకు గ్లౌజులు ధరించాలని సూచించారు. విద్యార్థులకు భోజనం వడ్డించే విధానాన్ని కూడా పరిశీలించిన డీడబ్ల్యూఓ, ఆహార తయారీ నుంచి వడ్డించే వరకు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాల సీలింగ్‌, మరుగుదొడ్ల మరమ్మతులతో పాటు విద్యార్థుల భద్రత కోసం ప్రహరీ నిర్మించాలని ప్రధానోపాధ్యాయుడు సల్మాన్ రాజ్ వినతిపత్రం సమర్పించారు. సమస్యలను పరిశీలించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని డీడబ్ల్యూఓ హామీ ఇచ్చారు. ఆమె వెంట కామేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ కె.ఉమా, సూపర్‌వైజర్లు సత్యశీలా, విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు సల్మాన్ రాజ్ ఉన్నారు.

Tags:

About The Author

Latest News