- District News
- శ్మశాన వాటికలకు రూ.5 కోట్లు మంజూరు చేయాలి.
శ్మశాన వాటికలకు రూ.5 కోట్లు మంజూరు చేయాలి.
ఆత్మగౌరవ దీక్షలో 16 కుల సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకుల డిమాండ్.
లోకల్ గైడ్ / తాండూర్:
తాండూర్ పట్టణంలోని బీసీ శ్మశాన వాటికల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని బీసీ సంఘం తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు. మంగళవారం అంబేద్కర్ కూడలి వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మగౌరవ దీక్షలో ఆయన మాట్లాడారు.
శ్మశాన వాటికల సమస్యలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయని, తాత్కాలిక పనులతో కాకుండా అన్ని మౌలిక వసతులు కల్పించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
మాజీ మున్సిపల్, గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ... బీసీ శ్మశాన వాటికల కోసం దీక్ష చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. రిటైర్డ్ అదనపు ఎస్పీ మధుసూదన్‌రావు మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌరవం కోసం అవసరమైతే మరింతగా పోరాడేందుకు సిద్ధమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. బీసీ సంఘాల డిమాండ్లకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ దీక్షలో 16 కుల సంఘాల ప్రతినిధులతో పాటు వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు.
