సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్ 

Published On
సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్ 

 

 సదాశివపేట టౌన్ రిపోర్టర్ లోకల్ గైడ్ 
సదాశివపేట పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ గారు పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.

దుర్గమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర బసవ సదన్ వరకు భక్తి శ్రద్ధలతో సాగింది. వేద మంత్రోచ్ఛారణలు, హరినామ సంకీర్తనలు, భజనలతో యాత్ర ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. రథాన్ని భక్తులు ఉత్సాహంగా లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా చింత సాయినాథ్ గారు మాట్లాడుతూ, జగన్నాథ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సనాతన ధర్మ విలువలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కౌన్సిలర్ సోము , నగేష్, ఇస్కాన్ ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్  ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ 
సొసైటీ డైరెక్టర్ , ఆర్ఎంపి రమేష్ తండ్రి దశదిన కర్మకు హాజరు
పోలీసుల నిర్బంధాన్ని  ఛేదించి పోరాడిన  విద్యార్థులు – ఫాసిస్టు దమనకాండతో దేశ యువతను అణచలేరు!
సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్ 
ఓటు హక్కు మాత్రమే కాదు...బాధ్యత కూడా. - పాఠశాల డైరెక్టర్ ధ్యావరి జయవర్ధన్ రెడ్డి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం:  నోరు అదుపులో పెట్టుకోవాలి.
ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో