- District News
- ఓటు హక్కు మాత్రమే కాదు...బాధ్యత కూడా. - పాఠశాల డైరెక్టర్ ధ్యావరి జయవర్ధన్ రెడ్డి
ఓటు హక్కు మాత్రమే కాదు...బాధ్యత కూడా. - పాఠశాల డైరెక్టర్ ధ్యావరి జయవర్ధన్ రెడ్డి
శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో మాక్ ఎన్నికలు. - ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
లోకల్ గైడ్/తాండూర్:
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా, సమాజం మరియు దేశ భవిష్యత్తును నిర్ణయించే బాధ్యత కూడా అనీ పాఠశాల డైరెక్టర్ ధ్యావరి జయవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూర్ పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో మాక్ ఎన్నికల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యతాయుత భావం, నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ముందుగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కే కాకుండా, సమర్థ నాయకులను ఎన్నుకునే బాధ్యత కూడా అని ఉపాధ్యాయులు వివరించారు.
అనంతరం స్కూల్ పీపుల్ లీడర్ పదవికి 10వ తరగతి విద్యార్థులు, అసిస్టెంట్ స్కూల్ పీపుల్ లీడర్ పదవికి 9వ తరగతి విద్యార్థులు పోటీ చేయగా, విద్యార్థులంతా రహస్య బ్యాలెట్ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించి నాయకులను ఎన్నుకున్నారు. ఎన్నికైన విద్యార్థి నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా, క్రమశిక్షణతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తం రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... "ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు. అది హక్కు మాత్రమే కాదు... బాధ్యత కూడా. నేటి విద్యార్థులే రేపటి బాధ్యతగల పౌరులు, సమర్థ నాయకులు. అందుకే చిన్నప్పటి నుంచే ప్రజాస్వామ్య విలువలను అలవర్చుకోవాలి" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. రమేష్, సీనియర్ ఉపాధ్యాయులు పి. చంద్రశేఖర్ రెడ్డి, ఏ. అనిల్ కుమార్, ఇతర ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.
