పోలీసుల నిర్బంధాన్ని  ఛేదించి పోరాడిన  విద్యార్థులు – ఫాసిస్టు దమనకాండతో దేశ యువతను అణచలేరు!

ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి –

మోదీ, అమిత్ షా నేటి నిరంకుశ దమనకాండకు బాధ్యత వహించాలి  నీట్‌ను రద్దు చేయాలి       
Published On
పోలీసుల నిర్బంధాన్ని  ఛేదించి పోరాడిన  విద్యార్థులు – ఫాసిస్టు దమనకాండతో దేశ యువతను అణచలేరు!

 

 

 
                
                సదాశివపేట టౌన్ రిపోర్టర్ లోకల్ గైడ్:


నీట్ పేపర్ లీకేజీ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చెలరేగిన విద్యార్థి, యువజన ఉద్యమం  ఢిల్లీలో “మార్చ్ టు పార్లమెంట్” సందర్భంగా చారిత్రాత్మక స్థాయికి చేరుకుంది. వేలాది మంది విద్యార్థులు, యువజనులు, నిరుద్యోగులు ఢిల్లీకి చేరుకుని నీట్‌ను రద్దు చేయాలని, పేపర్ లీకేజీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని cpm సదాశివపేట ఏరియా కార్యదర్శి వి ప్రవీణ్ కుమార్ మాండ్ చేశారు.

విద్యార్థుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి మోదీ–అమిత్ షా ప్రభుత్వం తీవ్ర నిర్బంధాలకు పాల్పడింది. అనేక లోకల్ రైళ్లను రద్దు చేసింది. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను దిగ్బంధం చేసింది. అక్కడికి వెళ్లే మెట్రో స్టేషన్లను మూసివేసింది. ఢిల్లీని పోలీసు శిబిరంగా మార్చింది. అయినప్పటికీ అన్ని నిర్బంధాలను ఛేదించి వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ స్ట్రీట్‌కు చేరుకుని తమ నిరసనను విజయవంతంగా నిర్వహించారు. లాఠీలు, బారికేడ్లు, టియర్ గ్యాస్ ప్రజా ఉద్యమాలను ఆపలేవని దేశ యువత నిరూపించింది.
ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఢిల్లీకి రావడం మోదీ ప్రభుత్వంపై దేశ యువతలో తీవ్రమైన వ్యతిరేకతకు నిదర్శనం. ఈ ప్రజాగ్రహాన్ని ఆత్మపరిశీలన చేసుకుని విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఫాసిస్టు పాలనకు తగినట్టుగా పోలీసు దమనకాండకు పాల్పడింది. “మార్చ్ టు పార్లమెంట్”ను అడ్డుకునేందుకు విచక్షణారహితంగా లాఠీచార్జి చేసింది. టియర్ గ్యాస్ ప్రయోగించింది. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకులపై కూడా లాఠీచార్జి చేసి టియర్ గ్యాస్ ప్రయోగించడం అత్యంత క్రూరమైన, అమానవీయమైన చర్య. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుపై జరిగిన ఈ దాడిని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
లాఠీలు, టియర్ గ్యాస్, అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో దేశ యువతను భయపెట్టవచ్చని మోదీ ప్రభుత్వం భ్రమపడుతోంది. ఫాసిస్టు నిర్బంధాలతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం ఎవరి తరం కాదు. ఎంత దమనకాండ పెరిగితే అంత తీవ్రంగా ప్రజా ఉద్యమాలు విస్తరిస్తాయి. నేటి ఉద్యమం అదే విషయాన్ని స్పష్టంగా నిరూపించింది.
నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నేడు ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన నిరంకుశ దమనకాండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించాలి. ప్రజాస్వామ్యాన్ని పోలీసు బూట్ల కింద నలిపివేసే ప్రతి ప్రయత్నాన్ని దేశ ప్రజలు, విద్యార్థులు, యువజనులు ఐక్యంగా తిప్పికొడతారు.
దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య, లౌకిక, ప్రగతిశీల శక్తులన్నీ విద్యార్థుల ఉద్యమానికి అండగా నిలబడి ఫాసిస్టు దమనకాండను ఐక్యంగా ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు

Tags:

About The Author

Latest News

ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్  ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ 
సొసైటీ డైరెక్టర్ , ఆర్ఎంపి రమేష్ తండ్రి దశదిన కర్మకు హాజరు
పోలీసుల నిర్బంధాన్ని  ఛేదించి పోరాడిన  విద్యార్థులు – ఫాసిస్టు దమనకాండతో దేశ యువతను అణచలేరు!
సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్ 
ఓటు హక్కు మాత్రమే కాదు...బాధ్యత కూడా. - పాఠశాల డైరెక్టర్ ధ్యావరి జయవర్ధన్ రెడ్డి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం:  నోరు అదుపులో పెట్టుకోవాలి.
ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో