ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ 

చీమలపాడు ప్రాంతంలో విస్తృత పర్యటన - పలు కుటుంబాలకు పరామర్శ 

సొసైటీ డైరెక్టర్ , ఆర్ఎంపి రమేష్ తండ్రి దశదిన కర్మకు హాజరు
Published On
ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ 

 



 

ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, జులై 22 : కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు, పాటిమీద గుంపు గ్రామాల్లో వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్  బుధవారం పర్యటించారు. పాటిమీద గుంపు గ్రామానికి చెందిన సొసైటీ  డైరెక్టర్ ఆర్ఎంపి. పోతురాజు రమేష్ తండ్రి పోతురాజు కృష్ణయ్య దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అంతకు ముందు చీమలపాడు గ్రామానికి చెందిన పాటి కోటయ్య అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మరణించిన 
బసవ రాంబాబు చిత్ర పటానికి నివాళులుర్పించి వారి కుటుంబ సభ్యులును ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట వైరా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ , సొసైటీ వైస్ చైర్మన్ సర్పంచ్ ధారావత్ మంగీలాల్ , మాజీ ఎంపీటీసీ ధరంసొత్ శంకర్ , మాజీ సర్పంచ్ లు మాలోత్ కిషోర్ , బానోత్ శంకర్ , మౌనిక , రాంజీ , మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మిర వీరన్న , మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాంకుడోత్ నరేష్ , నాయకులు పాటి శ్రీను , అజ్మిర భిక్కు లాల్ , బానోత్ ప్రసాద్ , 
వీరబాబు , దారావత్ ఫూల్సింగ్ , ఇస్లావత్ రాజాకుమార్ , శీలంశెట్టి  రాంబాబు , వెంకన్న , పాటి రమేష్ , గుగులోతు హారు ,  
భూక్య రాంకిషోర్ , తదితరులున్నారు.

Tags:

About The Author

Latest News

ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్  ప్రజల్లోనే నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ 
సొసైటీ డైరెక్టర్ , ఆర్ఎంపి రమేష్ తండ్రి దశదిన కర్మకు హాజరు
పోలీసుల నిర్బంధాన్ని  ఛేదించి పోరాడిన  విద్యార్థులు – ఫాసిస్టు దమనకాండతో దేశ యువతను అణచలేరు!
సదాశివపేటలో భక్తి పారవశ్యంగా జగన్నాథ రథయాత్ర ప్రత్యేక పూజలు చేసిన చింత సాయినాథ్ 
ఓటు హక్కు మాత్రమే కాదు...బాధ్యత కూడా. - పాఠశాల డైరెక్టర్ ధ్యావరి జయవర్ధన్ రెడ్డి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం:  నోరు అదుపులో పెట్టుకోవాలి.
ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో