- District News
- Khammam
- రైతులు విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి
రైతులు విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి
పంట మార్పిడితో లాభాలు – వైరా ఏడీఏ కరుణశ్రీ
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , మే 30 :
విత్తనాల విక్రయాలలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని వైరా ఏడీఏ కరుణ శ్రీ సూచించారు. శనివారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేధికలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లకువ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఏడీఏ మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని, అమ్మిన ప్రతి ప్యాకెటుకు బిల్లులు తప్పని సరిగా ఇవ్వాలన్నారు. విత్తనాలు ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వ్యాపారం నిర్వహించాలన్నారు.
*పంట మార్పిడితో లాభాలు*
రైతులు తప్పని సరిగా పంట మార్పిడి పాటించాలని ఏడీఏ కరుణశ్రీ అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పేరుపల్లిలో రైతులకు పంటమార్పిడి, పంట అవశేషాలను సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవటంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఏడీఏ మాట్లాడుతూ పంట అవశేషాలు కాల్చి భూమి సారాన్నిదెబ్బతీయవద్దన్నారు. అధిక నత్రజని ఉన్న యూరియా వంటి ఎరువులను వాడకం తగ్గించటం, సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా భూసారం పెరిగి పదికాలల పాటు నాణ్యమైన పంట పండుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల ఏవో భట్టు అశోక్ కుమార్ , పేరుపల్లి సర్పంచ్ బానోత్ పద్మావతి వీరభద్రం , ఏఈవో మున్నీ , ఎరువులు , విత్తన డీలర్ల సంఘం అధ్యక్షులు సురేందర్ మనియార్ తదితరులు పాల్గొన్నారు.
