- District News
- Mahabubnagar
- మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం
మహబూబ్నగర్ మే 30 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
మహిళలను భాగస్వాములుగా చేస్తే ఈ వ్యవస్థ భవిష్యత్తులో పెద్ద కార్పొరేట్ సంస్థగా ఎదగగలదని ఎమ్మెల్యే సూచించగా, ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి గారు* సానుకూలంగా స్పందించి, వెంటనే విధివిధానాల రూపకల్పనకు అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా, నియోజకవర్గంలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తక్కువ లీజుతో ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం, రిటైల్ రంగంలో శిక్షణ అందించడం ద్వారా మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞత సభలో వేలమంది మహిళలు పాల్గొని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైస్ మిల్లులు, ఇతర పారిశ్రామిక యూనిట్ల నిర్వహణలో కూడా మహిళలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
