బాధిత కుటుంబాలకు మనీషా ఓదార్పు

కారేపల్లిలో మృతుల కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకురాలు

Published On
బాధిత కుటుంబాలకు మనీషా ఓదార్పు

 

 

IMG-20260929-WA0096

సింగరేణి మండలం కారేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకురాలు బాణోత్ మనీషా లక్ష్మి మదన్ లాల్ పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు చింతల సంపత్ తండ్రి చింతల హనుమంతు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు. అలాగే ఇటీవల మృతి చెందిన పాలిక కొమరమ్మ కుటుంబాన్ని మనీషా పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రజలు, పార్టీ శ్రేణులతో మమేకమై వారి కష్టసుఖాల్లో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ
        కారేపల్లి, అక్టోబర్ 11 (లోకల్ గైడ్ న్యూస్): దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రుల సందర్భంగా కారేపల్లి మండలం గోవిందుతండా గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి
ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క
ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు
అమెరికాసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ' కూటమి ఘన విజయం
సి సి రోడ్డు శంకుస్థాపన చేసిన సర్పంచ్ ఖమ్మంపాటి స్వాతి జగన్  
సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.