ఎల్ నినో ప్రభావం.. నీటి ఎద్దడికి ముందస్తు ప్రణాళికలు అవసరం : ఎంపీడీఓ అరుంధతి

Published On
ఎల్ నినో ప్రభావం.. నీటి ఎద్దడికి ముందస్తు ప్రణాళికలు అవసరం : ఎంపీడీఓ అరుంధతి

దుగ్గొండి, సెప్టెంబర్ 29(లోకల్ గైడ్):

రాబోయే కాలంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని, ముందస్తు ప్రణాళికతో నీటిని ఒడిసిపట్టాలని దుగ్గొండి ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతి అన్నారు.
మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ - గ్రామీణ్ (విబి-జి రామ్ జి) పథకంపై సర్పంచులు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఎల్ నినో కారణంగా చలికాలం త్వరగా ముగిసి వేసవి తీవ్రత ముందే పెరిగే ప్రమాదం ఉందన్నారు. భూగర్భ జలాలను పెంచడం ద్వారానే నీటి సమస్యను అధిగమించవచ్చని, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
గ్రామసభల్లో ఉపాధి హామీ పనులను ప్రణాళికాబద్ధంగా గుర్తించాలని సూచించారు. ఊటకుంటల తవ్వకం, చెక్ డ్యామ్ ల నిర్మాణం, పాత కాలువల పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాస్, ఈసీ రాజు, సర్పంచులు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News