- District News
- ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క
ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క
సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Published On
By Ram Reddy
ములుగు జిల్లా( లోకల్ గైడ్ )
దక్షిణాఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడి, పాడారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, ఆటలతో వేడుకల్లో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సైతం ఘనంగా చాటుతున్న ప్రవాస తెలంగాణ మహిళలతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయత, ఉత్సాహం మధ్య సాగిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దేశ సరిహద్దులు దాటి విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించడం పట్ల మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నా తమ మూలాలను, సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా బతుకమ్మ వంటి పండుగలను జరుపుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు ప్రవాస తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు, భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడానికి అసోసియేషన్ ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ మహిళలు, ఇతర సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
11 Oct 2026 22:16:09
కారేపల్లి, అక్టోబర్ 11 (లోకల్ గైడ్ న్యూస్):
దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రుల సందర్భంగా కారేపల్లి మండలం గోవిందుతండా గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి
