- District News
- Khammam
- గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ
గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ
దసరా శరన్నవరాత్రుల్లో తొలి రోజు ప్రత్యేక పూజలు.. విగ్రహ దాతలు బర్మవత్ శ్రీను–సుజాత దంపతులు, కుమారుడు సిద్దు
కారేపల్లి, అక్టోబర్ 11 (లోకల్ గైడ్ న్యూస్):
దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రుల సందర్భంగా కారేపల్లి మండలం గోవిందుతండా గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని తొలి రోజు భక్తిశ్రద్ధలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల ఆరంభాన్ని పురస్కరించుకుని అమ్మవారిని బాల త్రిపుర సుందరి రూపంలో సుందరంగా అలంకరించగా, అమ్మవారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో పూజించడం విశేషం. ఈ క్రమంలో తొలి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహ దాతలైన బర్మవత్ శ్రీను, సుజాత దంపతులు, వారి కుమారుడు సిద్దును గ్రామస్తులు ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. దసరా నవరాత్రుల వేడుకలతో గోవిందుతండాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
