- District News
- Nalgonda
- సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.
సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.
ఉపాధ్యాయ పోరాట సంఘాల కమిటీ, నల్లగొండ జిల్లా.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగి పోకుండా ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ నల్లగొండ యు ఎస్ పి సి ఆధ్వర్యంలో గడియారం కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఎన్నికల ఫారం 6లో తీసుకొచ్చిన కొత్త నియమాలను రద్దు చేయాలని ,2023 ఎలక్షన్ కమిషనర్లకు తీసుకొచ్చిన రక్షణ చట్టాన్ని రద్దు చేయాలని, జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై ఎంక్వయిరీ చేయించాలని, 2024 తర్వాత జరిగిన ఎలక్షన్స్ అన్నింటిని రద్దు చేయాలని, తొలగించిన 13 కోట్ల ఓటర్ల రద్దు పై విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని ఇప్పుడున్న సీఈసీ జ్ఞానేశ్వర్ పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరగాలని యు ఏస్ పి సి నాయకులు నర్రా శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఓటు హక్కుకు భంగం కలగకుండా చూడాలని కోరారు.ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, పేదలు, కార్మికులు, వలస కార్మికులు సహా అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని పేర్కొన్నారు. సర్ ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలపై నిష్పాక్షిక విచారణ జరిపి, ప్రజలకు సమాధానం చెప్పాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్న యు.ఎస్.పి.సి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి టి ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశం, నాగయ్య, వెంకులు, ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ వేదిక అధ్యక్షులు రాములు, టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, నలపరాజు వెంకన్న, కొమర్రాజు సైదులు, పగళ్ళ సైదులు వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
