- District News
- Khammam
- కష్టకాలంలో అండగా... సింగరేణి మండల సర్పంచుల ఐక్యత!
కష్టకాలంలో అండగా... సింగరేణి మండల సర్పంచుల ఐక్యత!
భూక్యా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో తోటి సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.. ఐకమత్యమే తమ బలమని చాటిన సింగరేణి మండల సర్పంచులు
కారేపల్లి (సింగరేణి ), అక్టోబర్ 13 (లోకల్ గైడ్ న్యూస్ ) : కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, ఆపదలో ఒకరికొకరు అండగా నిలుస్తూ సింగరేణి మండల సర్పంచులు ఐక్యతను చాటుకున్నారు. గాదెపాడు గ్రామపంచాయతీ సర్పంచ్, సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పాటిమీద గుంపు సర్పంచ్ గుగులోత్ సుజాత–సంతోష్ దంపతులను పలువురు సర్పంచులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.
సర్పంచులంతా ఒక్కటే.. కష్టంలో ఎవరికైనా మేమున్నామనే భరోసా!
సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్ చొరవతో నిర్వహించిన ఈ పరామర్శ కార్యక్రమం సర్పంచుల మధ్య ఉన్న ఐక్యతకు, పరస్పర సహకారానికి నిదర్శనంగా నిలిచింది. పదవులు, గ్రామాల సరిహద్దులకు అతీతంగా సర్పంచులంతా ఒక కుటుంబంలా కలిసి ఉండాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. తోటి సర్పంచ్ కుటుంబానికి కష్ట సమయంలో అండగా నిలవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతని, ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే పరస్పర సహకారం మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే వీడియో కాల్లో పరామర్శ
వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ వీడియో కాల్ ద్వారా గుగులోత్ సుజాత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే స్వయంగా వచ్చి పరామర్శిస్తానని చెబుతూ ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రతి సర్పంచ్ ఆమె కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలని సూచించారు.
పరామర్శలో పాల్గొన్న సర్పంచులు
ఈ కార్యక్రమంలో సూర్యతండా సర్పంచ్ బానోత్ రాందాస్ నాయక్, సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు రేగులగూడెం సర్పంచ్ వీసాం మోతి వీరస్వామి, పేరుపల్లి సర్పంచ్ బానోత్ పద్మ వీరభద్రం , గేట్ కారేపల్లి సర్పంచ్ పూసం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఐక్యతే బలం.. పరస్పర సహకారమే లక్ష్యం!
తోటి సర్పంచ్ కుటుంబానికి అండగా నిలిచిన సింగరేణి మండల సర్పంచులు, ఐకమత్యంతో ముందుకు సాగుతామనే సందేశాన్ని ఇచ్చారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్యా రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధుల మధ్య సోదరభావానికి, మానవీయ విలువలకు ప్రతీకగా నిలిచింది.
