- District News
- Khammam
- విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపాలి!
విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపాలి!
పెద్దగోపతి, అనంతారం, బోట్లకుంట సమస్యలపై ఏఈకి ఊటుకూరి రంజిత్ వినతి
ఖమ్మం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 9: లోకల్ గైడ్:
కొణిజర్ల మండలంలోని పెద్దగోపతి గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊటుకూరి రంజిత్ విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పెద్దగోపతి, అనంతారం, బోట్లకుంట గ్రామాల్లో ప్రజల అవసరాల దృష్ట్యా కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. పెద్దగోపతి గ్రామంలోని ప్రధాన విద్యుత్ లైన్ను గ్రామం వెలుపలికి మార్చాలని, ఆర్సీఎం చర్చి వద్ద కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ లైన్ వేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తకుండా అవసరమైన కొత్త డీటీఆర్ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు ఊటుకూరి రంజిత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోటపాటి వెంకటేశ్వర్లు, ఉసికెల చిరంజీవి, నక్క వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
