నిరుపేదలకు ఇళ్ల స్థలాల కల్పనకు ప్రభుత్వ భూమి పరిశీలన

Published On
నిరుపేదలకు ఇళ్ల స్థలాల కల్పనకు ప్రభుత్వ భూమి పరిశీలన

 

సత్తుపల్లి, అక్టోబర్ 9: లోకల్ గైడ్:

సత్తుపల్లి మండలంలోని సిద్ధారం, గౌరీగూడెం గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు శుక్రవారం తహసీల్దార్‌తో కలిసి ప్రభుత్వ భూమిని పరిశీలించారు.

సిద్ధారం రెవెన్యూ పరిధిలోని ఏనుగుట్ట భూమిని అర్హులైన నిరుపేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసి, అక్కడ ఇళ్లు నిర్మించుకునేందుకు వినియోగించే అవకాశాలపై ఆయన అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇళ్లు లేని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలాలు అందించి, వారు సొంత ఇంటిని నిర్మించుకోవాలనే కలను సాకారం చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి! గాదెపాడు గ్రామంలోని యాదవ బజారు వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!
        కారేపల్లి, అక్టోబర్ 18 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం జిల్లా గాదెపాడు గ్రామపంచాయతీ పరిధిలోని యాదవ బజారు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను
గేట్ కారేపల్లి సద్దుల బతుకమ్మ వేడుకల్లో తోటకూరి పిచ్చయ్య దాతృత్వం!
వికారాబాద్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
షాద్ నగర్ బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
రావిర్యాల లో వైభవంగా దుర్గాష్టమి ఉత్సవాలు.
కారేపల్లిలో ఎల్‌నినోపై అలర్ట్‌.. పొదుపు చర్యలకు సర్పంచుల సిద్ధం! రంజిత్ కుమార్ 
బతుకమ్మ ఆడపడుచులకు చీరల కానుక.. గుడిపూడి తిరుమల రావు ఆప్యాయత!