ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం

పసిపాపల రోదనకంటే ఫోన్ శబ్దం వైద్యులకు ముఖ్యం 

Published On
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం

 

లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి:

వికారాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం సొంత జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యులే దేవుళ్లతో సమానం. ముఖ్యంగా శిశు వైద్య విభాగానికి వచ్చే అభం శుభం తెలియని పసిపాపల ప్రాణాలు పూర్తిగా వైద్యులు, వైద్య సహాయక సిబ్బంది చేతుల్లోనే ఉంటాయి. కానీ, ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు సిబ్బంది విధులు నిర్వహిస్తూనే నిరంతరం సెల్ ఫోన్లలో మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో మునిగిపోవడం చిన్నారుల ఆరోగ్యానికే కాకుండా వారి ప్రాణాలకే తీవ్ర ముప్పుగా మారుతోంది.
పసిపిల్లల పట్ల నిర్లక్ష్యం తీవ్రమైన పరిణామాలు చిన్న పిల్లలు తమ బాధను మాటల్లో చెప్పలేరు. వారి శరీరంలో వచ్చే మార్పులు, శ్వాస తీసుకునే విధానం, శరీర కదలికల ఆధారంగానే వైద్యం అందించాలి. కానీ ఫోన్ సంభాషణల్లో మునిగిపోవడం వల్ల ఈ ముఖ్యమైన సూచనలను గుర్తించడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది.
అత్యవసర సమయంలో  సున్నితమైన విభాగాల్లో ప్రతీ క్షణం ఎంతో విలువైనది. ఫోన్ వ్యామోహంలో పడి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులను సకాలంలో పట్టించుకోకపోవడం క్షమించరాని నేరం.
చిన్న పిల్లలపై ఎందుకు అంత చిన్నచూపు?
ఆసుపత్రికి వచ్చే పెద్దవారు తమ బాధను బిగ్గరగా చెప్పగలరు, ప్రశ్నించగలరు. కానీ నోరు లేని పసిపాపలు తమ వేదనను కేవలం ఏడుపు ద్వారానే వ్యక్తంచేస్తారు. సమాజంలోనూ ఆసుపత్రి  ఈ పసికందుల రక్షణ పట్ల కనీస జవాబుదారీతనం కొరవడటమే ఈ నిర్లక్ష్యానికి మూలకారణం. బాధితుల నుంచి తక్షణ నిరసన రాదనే ధీమాతోనే కొందరు సిబ్బంది తమ కనీస బాధ్యతలను విస్మరిస్తున్నారు.
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తీసుకోవాల్సిన చర్యలు
ప్రభుత్వాలు ఎంతటి ఆధునిక వైద్యం అందించినా నిధులు కేటాయించినా... మానవ వనరుల పర్యవేక్షణ లేకపోతే అన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. అత్యవసర మరియు శిశు సంరక్షణ విభాగాలలో విధుల్లో ఉండే వైద్యులు,తమ వ్యక్తిగత ఫోన్లను వాడకుండా స్పష్టమైన నిషేధం విధించాలి. వైద్యవృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అదొక పవిత్రమైన బాధ్యత. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ఈ అలవాటును సిబ్బంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ఎంతో నమ్మకంతో వచ్చే పేద తల్లిదండ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వైద్య వ్యవస్థపై ఉంది. పసిపాపల రోదన కంటే ఫోన్ శబ్దం ముఖ్యం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించినప్పుడే ఆసుపత్రుల్లో చిన్నారుల ప్రాణాలకు నిజమైన రక్షణ లభిస్తుంది దీనిపై అధికారులు స్పందిస్తూ నిత్యం ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్స్ ప్రజలకు మంచి వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన