బ్రాహ్మణ వెల్లంలలో 'ఆసరా' సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణకు ఘన సన్మానం.

నార్కట్‌పల్లి (బ్రాహ్మణ వెల్లంల)

Published On
బ్రాహ్మణ వెల్లంలలో 'ఆసరా' సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణకు ఘన సన్మానం.

 



నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్ .


నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో 'ఫేమస్ యూత్' సభ్యులు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ*కు చిరు సన్మానం నిర్వహించారు.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, సమాజంలో 'ఆసరా' సంస్థ ద్వారా హరికృష్ణ అందిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఫేమస్ యూత్ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా, సామాజిక స్పృహ కలిగి ఉండటం అభినందనీయమని అన్నారు. యువత అంతా ఐక్యంగా ఉంటూ గ్రామాభివృద్ధికి, సామాజిక సేవకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. తనను ఆహ్వానించి ఆత్మీయంగా సన్మానించిన 'ఫేమస్ యూత్' సభ్యులందరికీ ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 'ఫేమస్ యూత్' ప్రతినిధులు, సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు  గ్రామస్థులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News