సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మే 30:
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. కమిషనర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) హోదాకు పదోన్నతి పొందిన కె. మురళి, బి. రామ్ ప్రసాద్, ఎం. మధుసూదన్ రెడ్డి, అలాగే ఏఎస్ఐ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) హోదాకు పదోన్నతి పొందిన మహమ్మద్ బాకీ, యు. నాగేశ్వర్ రావు, జె. జగదీశ్వర్, బి. వెంకటరమణ రెడ్డి లను సీపీ అభినందించారు.ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా మరింత బాధ్యతను కూడా తీసుకువస్తాయని పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో, ప్రజా సేవే పరమావధిగా విధులు నిర్వహించాలని సూచించారు.పోలీస్ శాఖలో క్రమశిక్షణ, బాధ్యత, విధుల పట్ల నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని ఆమె అన్నారు. పెరిగిన బాధ్యతలకు అనుగుణంగా ప్రజలకు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొని పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు తెలిపారు.