- District News
- Ranga Reddy
- లక్కీ డ్రా లో- లక్కీగా ఇందిరమ్మ ఇల్లు
లక్కీ డ్రా లో- లక్కీగా ఇందిరమ్మ ఇల్లు
రాజేంద్రనగర్, ఆగస్టు 28 లోకల్ గైడ్ :
రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్పల్లి పరిధిలోని లక్ష్మీ కూడా లో ఆసక్తికర సన్నివేశం శుక్రవారం చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో లక్కీ డ్రా టోకన్ను ఓ బాలుడితో తీపించగా... ఆ చిన్నోడి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వరించడం అక్కడ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. పేదల సొంతింటి కల తీర్చాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పానికి, ఆ దేవుడు ఆశీస్సులు తోడైనట్లు చిన్నోడు తీసిన లక్కీ డ్రా లో వారి కుటుంబానికి (జరపుల లక్ష్మి) టోకెన్ రావడం తమ అందరినీ ఆనందానికి ఆశ్చర్యానికి గురి చేసిందని మంత్రి పొంగిలేటి పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాలు చాలా అరదు, చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం చిన్నారులు స్వచ్ఛమైన మనసు కలిగిన వారు అన్నారు. ఆ దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వ సహకారంతో వారి కళ నెరవేరుతుందని ఆ కుటుంబం సొంతింటిలో జీవితాంతం చల్లగా బ్రతకాలని ఆ బిడ్డను మంత్రి, ఎమ్మెల్యే ఆశీర్వదించారు.
