ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.

Published On
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.

IMG-20260828-WA0253వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,ఆగస్టు28
(లోకల్ గైడ్ న్యూస్)

హన్మకొండ సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి సంబరాలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు కి
పలువురు మహిళా నాయకులు రాఖీలు కట్టారు.నియోజకర్గవం నుండి వివిధ ప్రాంతాలు నుంచి తరలివచ్చిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది.రాఖీ పౌర్ణమి సందర్భంగా తరలివచ్చిన పార్టీ మహిళా నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు కి రాఖీలు కట్టి స్వీట్లు కూడా తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.తనకు ఆప్యాయంగా రాఖీలు కట్టిన మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.వారికి బహుమతిగా చీరలను అందజేశారు. వారితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడి, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఈ సందర్బంగా ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News

రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి: రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
సిద్దిపేట, ఆగస్టు 28(లోకల్ గైడ్): జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు పడకల గదుల ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ కె....
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.
గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో సామూహక కుంకుమ పూజ
తమ్మునికి రాఖీ కట్టిన అక్కలు అనుబంధానికి ప్రతీకగా రాఖీ వేడుకలు
లక్కీ డ్రా లో-  లక్కీగా ఇందిరమ్మ ఇల్లు 
రాజకీయాలకు అతీతంగా రాఖీ బంధం
హరీశ్ రావు సంతోషిమాత ఆలయంలో పూజలు అనంతరం రాఖీ కట్టిన మహిళా నాయకులు