- District News
- Ranga Reddy
- హిమాయత్ సాగర్ వద్ద ఎంఐఎం నాయకుడు ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.
హిమాయత్ సాగర్ వద్ద ఎంఐఎం నాయకుడు ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.
హిమాయత్ సాగర్ సమీపంలోని ఏకో పార్క్ సమీపంలో ఎంఐఎం నాయకుడు పైల్వాన్ దారుణ హత్య కు గురయ్యడు. రాజేంద్ర నగర్ కు చెందిన ముర్తుజ పైల్వాన్ సోమవారం సాయంత్రం కారులో శంషాబాద్ వైపు నుంచి రాజేంద్ర నగర్ వైపు వస్తుండగా సుమారు పది మంది గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి పాల్పడ్డారు. తల, ముఖం, ఏదపై కత్తులతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం ఐయ్యింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకొన్న శంషాబాద్ పోలీసులు చికిత్స నిమిత్తం అత్తా పూర్ లోని జెర్మన్ టెన్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్త స్రవం కావడం
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముర్తుజ పైల్వాన్ ప్రాణాలు విడిచాడు. ముర్తుజా పైల్వాన్ మర్డర్ విషయాన్ని తెలుసుకున్న ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. దీంతో రాజేంద్రనగర్ అత్తాపూర్ ప్రాంతాల్లో తీవ్రత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆసుపత్రి వద్ద రాజేందర్ నగర్ అత్తాపూర్ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ దారుణ హత్యకు ఎవరు పాల్పడ్డారు...? మాటు వేసి హత్యకు పాల్పడ్డారా... లేదా ప్రణాళిక ప్రకారం ఈ దారుణకు హత్యకు ఒడిగట్టారా... అనే కోణాల్లో పోలీసులు ప్రత్యేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టరం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
