పక్షవాతంపై అప్రమత్తతే ప్రాణరక్షణకు మార్గం.

అత్యాధునిక స్ట్రోక్ చికిత్సతో మెరుగైన వైద్య సేవలు.

మలక్‌పేట్ యశోదా ఆసుపత్రిలో రక్తపు గడ్డను కరిగించే చికిత్సతో పాటు మెకానికల్ థ్రాంబెక్టమీ అందుబాటు.
Published On
పక్షవాతంపై అప్రమత్తతే ప్రాణరక్షణకు మార్గం.

 

 

 


ఖమ్మం, నవంబర్ 20: లోకల్ గైడ్:

చేయి, కాలు ఒక్కసారిగా బలహీనపడుతున్నాయా మాట తడబడుతోందా ముఖం ఒకవైపుకు వాలిపోతోందా అయితే నిర్లక్ష్యం చేయవద్దు అవి పక్షవాతం స్ట్రోక్ హెచ్చరిక సంకేతాలు కావచ్చు. స్ట్రోక్ అనేది అత్యవసర వైద్య పరిస్థితి కావడంతో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులను సమీపంలోని సమర్థవంతమైన వైద్య సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తపు గడ్డ ఏర్పడటం లేదా రక్తనాళం పగిలి రక్తస్రావం జరగడం వల్ల స్ట్రోక్ సంభవిస్తుంది. దీనివల్ల మెదడులోని సంబంధిత భాగానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. సకాలంలో చికిత్స అందకపోతే శాశ్వత వైకల్యం ఏర్పడే అవకాశం ఉంది.స్ట్రోక్ హెచ్చరిక సంకేతాలు శరీరంలో ఒకవైపు అకస్మాత్తుగా బలహీనత లేదా తిమ్మిరి రావడం, మాట్లాడటంలో ఇబ్బంది, ముఖం ఒకవైపు వాలిపోవడం, కంటిచూపు మందగించడం, తలతిరగడం, శరీర సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా సబ్ అరాక్నాయిడ్ హెమరేజ్ అనేది మెదడు చుట్టూ ఉన్న పొరల మధ్య రక్తస్రావం జరిగే ప్రమాదకరమైన స్ట్రోక్ రకం. బ్రెయిన్ అన్యూరిజం దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి అలాగే కరోటిడ్ ఆర్టరీల్లో రక్తనాళాల అడ్డంకులు ఏర్పడితే మెదడుకు రక్తప్రసరణ తగ్గి స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అవసరాన్ని బట్టి వైద్యుల సూచనల మేరకు స్టెంటింగ్ వంటి చికిత్సలతో రక్తప్రసరణను మెరుగుపరిచే అవకాశం ఉంటుంది.
అధునాతన వైద్యంతో మెరుగైన ఫలితాలు హైదరాబాద్ మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక స్ట్రోక్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సకాలంలో పరీక్షలు నిర్వహించి స్ట్రోక్ రకాన్ని గుర్తించడం, అవసరమైన రోగులకు రక్తపు గడ్డను కరిగించే థ్రాంబోలైసిస్ మందులు అందించడం, ఎంపిక చేసిన ఇస్కీమిక్ స్ట్రోక్ రోగులకు మెకానికల్ థ్రాంబెక్టమీ చికిత్స నిర్వహించడం వంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపాయి.మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది అత్యాధునిక, అతి తక్కువ కోతతో చేసే న్యూరోఇంటర్వెన్షనల్ చికిత్స. ఇమేజింగ్ సాంకేతికత సహాయంతో ప్రత్యేక పరికరాలను రక్తనాళాల ద్వారా మెదడులోని అడ్డంకి ఏర్పడిన ప్రాంతానికి చేర్చి రక్తపు గడ్డను తొలగిస్తారు. తద్వారా మెదడుకు రక్తప్రసరణను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. సరైన రోగులకు తగిన సమయంలో ఈ చికిత్స అందిస్తే కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయని వైద్యులు వివరిస్తున్నారు.వైద్య నిపుణుల సూచనలు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి మాట్లాడుతూ  స్ట్రోక్ అత్యవసర వైద్య పరిస్థితి అని, ఇందులో ప్రతి నిమిషం కీలకమని తెలిపారు. లక్షణాలను ముందుగానే గుర్తించి బాధితులను వెంటనే ఆసుపత్రికి తీసుకురావడం ద్వారా మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. పరీక్షల అనంతరం స్ట్రోక్ రకాన్ని బట్టి రక్తపు గడ్డను కరిగించే మందులు లేదా అధునాతన చికిత్సలను ఎంపిక చేస్తామని వివరించారు.కన్సల్టెంట్ న్యూరో అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సంకేత్ దాస్ మాట్లాడుతూ  మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి అధునాతన విధానాలు తీవ్రమైన ఇస్కీమిక్ స్ట్రోక్‌తో బాధపడుతున్న ఎంపిక చేసిన రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. న్యూరాలజిస్టులు, న్యూరోఇంటర్వెన్షనల్ నిపుణుల సమన్వయంతో సకాలంలో చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు.ఆసుపత్రి యాజమాన్యం విజ్ఞప్తి మలక్‌పేట్ యశోదా ఆసుపత్రిలో ప్రత్యేక నాడీ సంబంధిత వైద్య సేవలతో పాటు మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు. పక్షవాతం లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, లక్షణాలు కనిపించినప్పుడు ఇంటి చిట్కాలు, స్వీయ వైద్యం లేదా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలని ప్రజలకు సూచించారు.

Tags:

About The Author

Latest News