- District News
- Ranga Reddy
- రాజేంద్రనగర్‌లో బిఆర్‌ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
రాజేంద్రనగర్‌లో బిఆర్‌ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కార్తీక్ రెడ్డి.
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ): అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో నూకలు చెల్లాయని బి ఆర్ ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జి పి. కా
ర్తీక్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు, నాయకులు శనివారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అయన కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. అనంతరం కార్తీక్ రెడ్డి
మాట్లాడుతూ...తెలంగాణ లో కాంగ్రెస్, బిజెపి దొందు దెందేనని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలను ప్రజలు గంగలో కలపడం ఖాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడని, అందుకే యావత్తు తెలంగాణ ప్రజలు బి ఆర్ ఎస్ లో చేరుతున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పోరెడ్డి ధర్మా రెడ్డి, ఎర్రోళ్ల యాదయ్య, శివ ముదిరాజ్, నరేష్ యాదవ్, ఎస్. వెంకటేష్, గుమ్మడి కుమార్, వీ.నవీన్, సరికొండ దుర్గేష్, పచ్చ శ్రీనివాస్, ముక్రమ్ ఖాన్, పటేల్ తదితరులు పాల్గొన్నారు.
