కార్తీక పౌర్ణమికి బుగ్గ దేవాలయంలో జ్వాల తోరణం..

Published On
కార్తీక పౌర్ణమికి బుగ్గ దేవాలయంలో జ్వాల తోరణం..

 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయం కమిటీ,అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 24న తొలిసారి నూతనంగా జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దేవస్థాన నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరై స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతు దేవస్థాన కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ గుప్తా,అర్చకులు బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే జ్వాలాతోరణం కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.కన్నాల గ్రామంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ జ్వాలాతోరణం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దేవస్థాన అధికారులు,అర్చకులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని నిర్వాహకులు కోరారు.

Tags:

About The Author

Latest News

కార్తీక పౌర్ణమికి బుగ్గ దేవాలయంలో జ్వాల తోరణం.. కార్తీక పౌర్ణమికి బుగ్గ దేవాలయంలో జ్వాల తోరణం..
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక
ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
షాద్‌నగర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
నియోజవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు…. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా  కరీంనగర్ పట్టణంలోని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చల్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 
అంబేద్కర్ విగ్రహం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి