కెవీసీఎస్‌లో ఘనంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డే.

పండ్లు, కూరగాయల వేషధారణలో చిన్నారుల సందడి!

పాటలు, నృత్యాలతో అలరించిన నర్సరీ, కేజీ విద్యార్థులు - తల్లిదండ్రుల సృజనాత్మక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ
Published On
కెవీసీఎస్‌లో ఘనంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డే.


లోకల్ గైడ్/తాండూరు:
పండ్లతో పాఠాలు.. కూరగాయలతో ఆరోగ్య సందేశాలు.. చిన్నారుల ఆటపాటలతో తాండూరులోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ (కెవీసీఎస్)లో సందడి నెలకొంది. చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడంతో పాటు పండ్లు, కూరగాయల్లోని పోషక విలువలను తెలియజేసే ఉద్దేశంతో శనివారం పాఠశాలలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నర్సరీ, జూనియర్ కేజీ, సీనియర్ కేజీ విద్యార్థులు వివిధ రకాల పండ్లు, కూరగాయల ఆకృతుల్లో రంగురంగుల వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండ్లు, కూరగాయల ప్రాముఖ్యతను వివరిస్తూ ఆరోగ్యంపై సందేశాలను అందించారు. అనంతరం చిన్నారులు స్వాగత గీతాలు, కూరగాయలపై రూపొందించిన పాటలు, పండ్ల నేపథ్యంతో నృత్య ప్రదర్శనలు నిర్వహించి అందరినీ అలరించారు.
ఈ వేడుకల్లో తల్లిదండ్రులు పండ్లు, కూరగాయలతో రూపొందించిన వినూత్నమైన కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల ఉత్సాహం, ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శనలను చూసి తల్లిదండ్రులు అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన జీవనానికి పండ్లు, కూరగాయలను నిత్యాహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. చిన్నతనం నుంచే మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని తెలిపారు. విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించడమే పాఠశాల లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సతీష్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News