పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయం.

జిల్లేడు చౌదరిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్. శేఖర్.

పెద్ద ఎల్కిచర్ల, చేగిరెడ్డి ఘనపూర్ గ్రామాల్లో రేషన్ షాపులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎన్. శేఖర్.
Published On
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయం.

 

 

 

లోకల్ గైడ్,జిల్లేడు చౌదరిగూడెం.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని,ధనికులతో సమానంగా ప్రతి పేద కుటుంబం సన్నబియ్యంతో ఆహారాన్ని బుజించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరిగుడ మండల అధ్యక్షుడు జాకారం చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని  పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో రేషన్ డీలర్ లింగం, చేగిరెడ్డి ఘనపూర్ లో డీలర్ అఖిల్ ల నూతన చౌక ధర దుకాణాలను ఇంచార్జి తహశీల్దార్ భాస్కర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.శేఖర్,అలాగే సర్పంచులు సోని,పావని లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్. శేఖర్ మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా వేలాది మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుంటే ప్రజల అవసరాలను, ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిదన్నారు. అదే విదంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. ప్రజలు రేషన్ సరుకులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రాంబాబు, జీపీఓ శ్రీనివాస్,  కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు, సర్పంచులు రామచంద్రయ్య, బందెయ్య, చందునాయక్, సీనియర్ నాయకులు ఆంజనేయులు, సత్యనారాయణ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, పిట్ట రజిత, ఈడిగి లింగం, దోమ శ్రీనివాస్, దామోదర్, హసన్,ఇద్రిస్, సుధాకర్ రెడ్డి, యాదయ్య, మల్లేష్, ప్రసాద్, నర్సింలు, సలీమ్, పెద్ద ఎల్కిచర్ల, ఉప సర్పంచి బాలరాజు, చేగిరెడ్డి ఘనపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదింట వెలిగిన దీపావళి దీపాలు.. రావోజీతండాలో సర్పంచ్ భూక్య బాలు ఆధ్వర్యంలో వేడుకలు! పేదింట వెలిగిన దీపావళి దీపాలు.. రావోజీతండాలో సర్పంచ్ భూక్య బాలు ఆధ్వర్యంలో వేడుకలు!
        కారేపల్లి, నవంబర్ 7 (లోకల్ గైడ్ న్యూస్): పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం
దీపావళి వేళ పటాకుల దందా! - అనుమతులకు మించి బాణసంచా నిల్వలు?
చట్టాన్‌పల్లి ఆర్ఓబి నిర్మాణం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలే ప్రధాన అడ్డంకి!
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయం.
బార్వాద్ గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మరియు కాంగ్రెస్ నాయకుల బీఆర్‌ఎస్ చేరికల గురించి తెలియజేస్తోంది.
ఆదర్శ ఉపాధ్యాయుడు మిద్దెల రాములు గౌడ్ కన్నుమూత!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు లో తొలి బీసీ ఎమ్మెల్యే : తీన్మార్ మల్లన్న