- District News
- దీపావళి వేళ పటాకుల దందా! - అనుమతులకు మించి బాణసంచా నిల్వలు?
దీపావళి వేళ పటాకుల దందా! - అనుమతులకు మించి బాణసంచా నిల్వలు?
ఇష్టారాజ్యంగా విక్రయాలు.. నిబంధనలకు తూట్లు. - కనిపించని అధికారుల పర్యవేక్షణ!
లోకల్ గైడ్ / తాండూర్:
దీపావళి పండుగ వేళ బాణసంచా ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పండుగ సందడిని ఆసరాగా చేసుకొని తాండూర్ పట్టణంలోని జై భవాని క్రాకర్స్ వ్యాపారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఆరోపణలు వెలువడుతున్నాయి. నిబంధనల అమలుపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వ్యాపారులు ఆడిందే ఆటగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.
దుకాణాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో పాటు ఫైర్ సేఫ్టీ చర్యలు కూడా చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దుకాణం పక్కనే ఉన్న రహదారిని పూర్తిగా ఆక్రమించి, అడ్డగోలుగా వాహనాలను నిలిపివేయడంతో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దుకాణంలో నిల్వలు, భద్రతా ఏర్పాట్లు, నిబంధనల అమలుపై తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
