కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!

ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం.. నవంబర్ 6 చివరి గడువు

Published On
కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!

 

 

కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్):

ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో మండలవ్యాప్తంగా ఏడు క్లస్టర్లలో ఉచిత ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ సింగరేణి మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటకూరి రాంబాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపే లక్ష్యంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా చీమలపాడు, మాణిక్యారం, సీతారాంపురం, భాగ్యనగర్, సింగరేణి, మాదారం, గేట్ కారేపల్లి ప్రాంతాల్లో ఉచిత ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పట్టభద్రుల ఓటరు నమోదులో ఇప్పటికే ఆలస్యం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరు నమోదు చేసుకోవడానికి 2026 నవంబర్ 6 చివరి తేదీ కావడంతో గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పట్టభద్రులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సర్పంచ్ మేదరి టోనీ, జిల్లా నాయకులు గుగులోత్ భీముడు, కడియాల సుధాకర్,మాదారం కాంగ్రెస్ నాయకుడు అజ్మీర నరేష్, సురేందర్, ఈర్య, గాంధీ ఏసు, నాగవేణి, షఫీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు! కారేపల్లిలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత కేంద్రాలు!
        కారేపల్లి, అక్టోబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్): ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల
ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో వ్యవసాయ క్షేత్ర చెరువు నిర్మాణం చేపట్టాలి
థాంగ్‌-టా విజేతలకు కలెక్టర్‌ అభినందన
కొందుర్గు రైతు వేదికలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ...
మామిడిపల్లి లో ఐ ర్ ఐ ఎస్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు. 
నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ఎజెండా -మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రా రెడ్డి.                                
మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్