- District News
- Ranga Reddy
- చట్టాన్‌పల్లి ఆర్ఓబి నిర్మాణం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలే ప్రధాన అడ్డంకి!
చట్టాన్‌పల్లి ఆర్ఓబి నిర్మాణం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలే ప్రధాన అడ్డంకి!
బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి
లోకల్ గైడ్ తెలంగాణ/ రంగారెడ్డి ఫరూక్నగర్
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతోనే పనులు నిలిచిపోయాయి – ఎంపీ డీకే అరుణమ్మ రాసిన లేఖలే ఆధారం!
100 శాతం రైల్వే నిధులతో నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఎంపీ విజ్ఞప్తి!
షాద్‌నగర్: చట్టాన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి ( ఎల్ సి నంబర్ 27) నిర్మాణంపై ఇటీవల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.2023లోనే మక్తమాదారం రోడ్డులో చట్టాన్‌పల్లి ఆర్ఓబి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులు కేటాయించే విధంగా ప్రాజెక్టు రూపొందించారని తెలిపారు. ఎన్నికల అనంతరం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డిజైన్ మార్పు కోరడంతో నిర్మాణ ప్రక్రియలో జాప్యం ఏర్పడిందని వివరించారు.
రైల్వే బోర్డు కీలక నిర్ణయం – 19-08-2024
రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధుల కారణంగా నిలిచిపోయిన ఆర్ఓబి పనుల విషయంలో 19-08-2024న రైల్వే బోర్డు కీలక విధానపరమైన నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులను 100 శాతం రైల్వే నిధులతో చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని నిర్ణయించిందని తెలిపారు.
ఎంపీ డీకే అరుణమ్మ నిరంతర ప్రయత్నాలు
చట్టాన్‌పల్లి ఆర్ఓబి నిర్మాణం కోసం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ 08-06-2025న రైల్వే శాఖ సహాయ మంత్రికి లేఖ రాశారని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు సమకూర్చే పరిస్థితిలో లేదని అధికారుల ద్వారా తెలిసిన విషయాన్ని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు.అనంతరం 24-09-2025న మరోసారి రైల్వే శాఖకు లేఖ రాస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయిందని వివరించారని పేర్కొన్నారు.
అంతేకాకుండా చట్టాన్‌పల్లి ఎల్ సి నంబర్ 27 వద్ద బండి నిర్మాణాన్ని 100 శాతం రైల్వే నిధులతో చేపట్టేలా ప్రతిపాదనలు పంపించాలని రైల్వే అధికారులను ఎంపీ కోరిన విషయాన్ని గుర్తుచేశారు.
అధికారిక లేఖలతో వాస్తవాలు ప్రజల ముందుకు రావాలి
రైల్వే బోర్డు 100 శాతం నిధులతో నిర్మాణాన్ని పరిశీలించే విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల అంశం ప్రాజెక్టుకు ఆటంకంగా మారినట్లు ఎంపీ తన లేఖల్లో పేర్కొన్నారని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు.చట్టాన్‌పల్లి ఆర్ఓబి విషయంలో ఎవరు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇచ్చింది? అనే అంశాలపై రాజకీయ ప్రకటనల కంటే అధికారిక లేఖల్లోని వాస్తవాలే ప్రజలకు తెలియాలని అన్నారు.
100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయబోతున్నాం డికే అరుణమ్మ గారి ఆధ్వర్యంలో త్వరలో టెండర్ కి పిలిచి 45 రోజులలో శంకుస్థాపన కూడా ప్రారంభిచ్చుకోబోతున్నాం అని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఈసునాతి శ్రీనివాస్, జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్, జిల్లా ఎస్టి మోర్చా ఉపాధ్యక్షుడు వీరేందర్ నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మిద్దె గణేష్, సర్పంచ్ రాజు నాయక్, బీజేపీ సీనియర్ నాయకుడు సుధాకర్ అప్ప, కారెడ్ల నరేందర్ రెడ్డి, కుడుముల బాలరాజ్, భాస్కర్ పటేల్, శ్రవణ్, కృష్ణ యాదవ్
