అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

ఎల్ నినో ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొందాం

అధికారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచన
Published On
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

 

కేశంపేట,( లోకల్ గైడ్ ):

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి ఏ ఒక్కరూ లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులకు సూచించారు. గతంలో కరోనా మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కొన్న తరహాలోనే ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో తలెత్తే ప్రకృతి విపత్తులను కూడా ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి రమాదేవి, సింగిల్ విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ రాజేందర్ రెడ్డి, ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పల్లె ఆనంద్, భాస్కర్ గౌడ్, సురేష్ రెడ్డి, భాస్కర్, నాగేష్, వేణుగోపాలచారి, కవితకర్ణాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సుజాత, భారతి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News