ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతో ఇస్తున్నాం..

Published On
ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతో ఇస్తున్నాం..

IMG-20260831-WA0350IMG-20260831-WA0352

అడిగిన వాళ్లందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం.. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం..

మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం..

మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల మందిలో బీఆర్ఎస్ వాళ్లు కూడా ఉన్నారు.. సన్నబియ్యం తింటూ విమర్శలు చేస్తున్నారు..

కేసీఆర్ ఏనాడైనా ఆలోచించాడా..?

7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం.. హైదరాబాద్‌లో పేదల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం..

ప్రజా పాలన అంటే ఇది కదా..

1000 ఎకరాల్లో కేసీఆర్, 100 ఎకరాల్లో కేటీఆర్, జన్వాడలో 50 ఎకరాల్లో కవిత ఫామ్‌హౌస్ కట్టుకున్నారు..

పేదల ఆత్మగౌరవం అయిన రేషన్ కార్డు ఇవ్వాలని ఏనాడైనా ఆలోచించారా..?

 

సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,500 కోట్లు ఖర్చు పెట్టాం..

త్వరలోనే ఎల్‌బీ నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించుకోబోతున్నాం..

ఉస్మానియా ఆస్పత్రి వరదల్లో మునిగిపోతే 2,000 కోట్లు పెట్టి కొత్త ఆస్పత్రి కట్టాలని ఆలోచన ఎందుకు చేయలేదు..?

మా ప్రభుత్వం 2,000 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిస్తోంది..

మర్రి చెన్నారెడ్డి కాలి గోటికి కూడా సరిపోరు..

అల్వాల్ టిమ్స్ ఆస్పత్రికి మాజీ సీఎం అంజయ్య పేరు పెడతాం..

ఎల్‌బీ నగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్ పేరు పెడతాం..

వరంగల్ ఆస్పత్రికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతాం..

మీ పేర్లు పెట్టాలి, పోతే మీ విగ్రహాలు పెట్టాలన్నదే మీ ఆలోచన..

సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహం తీస్తామంటున్నారు.. ముట్టుకోండి చూస్తాం..

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు.. సెక్రటేరియట్ ముందు మేం పెట్టాం..

మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని నెక్లెస్ రోడ్డులో పెట్టాం..

ఇది మా పరిపాలన వైఫల్యమా..?

శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను అనాథలా రోడ్డుమీద పడేస్తే మహిళా కమిషన్ సభ్యురాలిగా చేశాను..

వీరనారి చాకలి ఐలమ్మ పేరు మహిళా యూనివర్సిటీకి పెట్టాను..

చాకలి ఐలమ్మ మనవరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిని చేశాను..

నాకు, మీకు పోలికనా..?

కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కొడుకు, అల్లుడిని మంత్రినిచేశారు..

నేను పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని మంత్రులు చేశాను..

నేను సీఎం అయితే వి. హనుమంతరావును ప్రభుత్వ సలహాదారుగా చేశాను.. అనిల్ యాదవ్‌ను ఎంపీ చేశాను..

ఎర్రబెల్లి దయాకర్‌ను మంత్రిని చేశావు.. నేను అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రి చేశాను..

కేసీఆర్ వెంకట్ రామిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తే, నేను అద్దంకి దయాకర్‌ను ఎమ్మెల్సీ చేశాను..

కేసీఆర్ తన కొడుకును వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే, నేను బలహీన వర్గాల బిడ్డ మహేష్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేశాను..

1000 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాను..

1931లో బ్రిటిష్ వాళ్లు కులగణన చేస్తే, మళ్లీ 100 ఏళ్ల తర్వాత తెలంగాణలో బీసీ కులగణన చేసి మోదీకి సవాల్ విసిరాం..

గిగ్ వర్కర్ల కోసం పాలసీ తెచ్చాం..

స్పోర్ట్స్, ఐటీ, టూరిజం, ఎండోమెంట్ పాలసీ తీసుకువచ్చాం..

1000 రోజుల్లో కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల జీతం కేసీఆర్ తీసుకున్నాడు..

ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే డిస్మిస్ చేస్తారు.. మరి కేసీఆర్‌ను ఏం చేయాలి..?

ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ భద్రత, వసతుల కోసం 21 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది..

1000 రోజుల్లో పేదలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, రైతులు, దళితులు, ఆదివాసీల కోసం ఒక్క రోజైనా పనిచేశావా..?

మనమడు ఆస్పత్రికి వెళ్తే, బంధువులు ఎవరైనా చనిపోతే తప్ప బయటకు రాలేదు..

1000 రోజుల్లో ఒక్క గంటైనా సెలవు తీసుకోలేదు.. 1000 రోజుల్లో ఒక్కరోజైనా పనిచేశావా.. నీకు, నాకు పోలికనా..?

నందికి, పందికి ఉన్న తేడా ఉంది..

1000 రోజులు ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని అన్ని చోట్ల నిరసనలు తెలపాలి..

పందికొక్కుల్లా తిని ఫామ్‌హౌస్ నుంచి బయటకు రారా..?

దేశంలో ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు 1000 రోజులు బయటకు రాకుండా ఉన్నారా..?

ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెందిన రాష్ట్రం తెలంగాణ..

తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం పెట్టి కార్యకర్తల రక్తాన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు అమ్ముకున్న దుర్మార్గులు..

అగ్గిపెట్టెరావుకు ఆనాడు పది పైసల అగ్గిపెట్టె దొరకలేదు..

ఇరవై రెండు కోట్ల నాలుగు లక్షల నలభై వేల జీతం తీసుకున్న ప్రతిపక్ష నాయకుడు వెంటనే రాజీనామా చేయాలని నిరసనలు తెలపాలి..

6న ఇందిరా పార్క్‌లో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి..

7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ల ఎదురుగానే అన్ని విషయాలు చెప్తా..

తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీకి కేసీఆర్ రావాలి..

పదేళ్లలో కేసీఆర్ ఏం చేశాడో, 1000 రోజుల్లో నేను ఏం చేశానో అసెంబ్లీలో చర్చకు సిద్ధం..

ఏనాడూ పదవిని దుర్వినియోగం చేయలేదు.. చేయను..

తెలంగాణ ఉద్యమంలో నేను, నా ముసల్ది అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మొత్తం తన కుటుంబాన్ని దించాడు..

గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారు..

రేపటి నుంచి ఆరు రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు తెలపాలి..

Tags:

About The Author

Latest News