కాంగ్రెస్‌కు దోచుకోవడమే తెలుసు.. పాలన చేతకాదు!.

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలం.

తాండూరులో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు ఏవీ?. - ఎమ్మెల్యే తీరుపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విమర్శలు.
Published On
కాంగ్రెస్‌కు దోచుకోవడమే తెలుసు.. పాలన చేతకాదు!.

లోకల్ గైడ్/తాండూరు:
కాంగ్రెస్ ప్రభుత్వానికి దోచుకోవడం తప్ప ప్రజలకు పాలన అందించడం చేతకావడం లేదని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. గురువారం తాండూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం విద్యుత్ కోతలు, నీటి కొరతతో రైతులు పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
తాండూరు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమ రవాణాను అరికట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలన్నారు. నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, రైతులు, సామాన్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం! కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం!
                కారేపల్లి, అక్టోబర్ 15 (లోకల్ గైడ్ న్యూస్): కారేపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన
కాంగ్రెస్‌కు దోచుకోవడమే తెలుసు.. పాలన చేతకాదు!.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని జరపకపోవడం విచారకరం!
వికారాబాద్‌లో ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకై కలెక్టర్‌కు వినతిపత్రం:
ధాన్యం కొనుగోలుపై కేంద్రాల ఇన్చార్జులకు శిక్షణ
ప్రజల భద్రతకు పోలీసులతో కలిసి పనిచేయాలి
నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!