బీఎస్పీ తోనే బహుజనులకు భవిష్యత్తు : రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాంకృష్ణ 

Published On
బీఎస్పీ తోనే బహుజనులకు భవిష్యత్తు : రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాంకృష్ణ 


లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా, బ్యూరో ప్రతినిధి :

బీఎస్పీ తోనే బహుజనుల జీవితాలకు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాంకృష్ణ అన్నారు. బీఎస్పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కట్టెల మల్లేశం అధ్యక్షతన శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి పార్టీని చేర్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ సిద్ధాంతాలను ప్రజలకు అందించడం ద్వారా బహుజన రాజ్యాధికార దిశగా ప్రజల్లో ఓటు చైతన్యం పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతమున్న పాలకుల విధానాలతో విసిగి వేసారిన ప్రజలు రాష్ట్రంలో, దేశంలో ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని వివరించారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీలో ఉంటుందని, పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో విజయం సాధించే విధంగా పార్టీని నిర్మించాలని కార్యకర్తలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాలుగవ జోన్ ఇంచార్జ్ అంతటి నాగన్న, చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జ్ సయ్యద్ అమీర్, జిల్లా ఉపాధ్యక్షులు చెట్టుకింద ఇసువప్ప, ప్రధాన కార్యదర్శి చెన్నప్ప,  కార్యదర్శి కృష్ణంరాజు, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ సౌమ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్,  వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల ఇంచార్జీలు ఫిరంగి జనార్ధన్, ఊషనోళ్ల రమేష్ బాబు, కొడంగల్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్,  వెంకటేశం, ప్రధాన కార్యదర్శి కేశవులు, నాయకులు ఆడికె మల్లేష్,  టిప్పర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బీఎస్పీ తోనే బహుజనులకు భవిష్యత్తు : రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాంకృష్ణ  బీఎస్పీ తోనే బహుజనులకు భవిష్యత్తు : రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాంకృష్ణ 
లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా, బ్యూరో ప్రతినిధి : బీఎస్పీ తోనే బహుజనుల జీవితాలకు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాంకృష్ణ అన్నారు. బీఎస్పీ...
కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం!
కాంగ్రెస్‌కు దోచుకోవడమే తెలుసు.. పాలన చేతకాదు!.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని జరపకపోవడం విచారకరం!
వికారాబాద్‌లో ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకై కలెక్టర్‌కు వినతిపత్రం:
ధాన్యం కొనుగోలుపై కేంద్రాల ఇన్చార్జులకు శిక్షణ
ప్రజల భద్రతకు పోలీసులతో కలిసి పనిచేయాలి