- District News
- మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని జరపకపోవడం విచారకరం!
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని జరపకపోవడం విచారకరం!
జయంతి వేడుకలు నిర్వహించకపోవడంపై 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆవేదన.
లోకల్ గైడ్/తాండూర్:
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను నిర్వహించకపోవడం విచారకరమని తాండూర్ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి విశేష సేవలందించిన మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించడం ద్వారా వారి ఆశయాలను, సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
సాధారణ కుటుంబంలో జన్మించి, తన ప్రతిభతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన అబ్దుల్ కలాం యువతకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. ముఖ్యంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, దేశభక్తిని, ఉన్నత లక్ష్యాలను సాధించాలనే పట్టుదలను పెంపొందించడంలో కలాం జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.
ఇలాంటి మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించకపోవడం బాధాకరమని జావిద్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు,నాయకులు స్పందించి మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించి వారికి తగిన గౌరవం కల్పించాలని ఆయన కోరారు.
